శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (15:34 IST)

మహేష్ బాబు ఫ్యామిలీతో మరోసారి విదేశాలకు పయనం

mahesh family
mahesh family
మహేష్ బాబు ఫ్యామిలీతో మరోసారి విదేశాలకు పయనం అయ్యారు. నేడు హైదరాబాద్  విమానాశ్రయంలో కనిపించారు. షూటింగ్ గ్యాప్లో వీలున్నప్పడు ఇలా వెళ్లడం ఆయనకు అలవాటు. పిల్లలకు వేసవి సెలవులు దొరకడంతో ఇలా బయలు దేరారు. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్, సితార ఘట్టమనేని, గౌతమ్ ఘట్టమనేనిలను వారి మేనేజర్ వంశి విమానాశ్రయంలో  డ్రాప్ చేసి వచ్చారు. 
 
తాగాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ కాంబినేషన్లో SSMB 28 సినిమాతో హ్యాట్రిక్ మీద గురి పెట్టారు. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల ముగిసింది. మహేష్, పూజా హెగ్డే  పాల్గొనగా  కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. మరల తిరిగి వచ్చాక షూటింగ్ చేయనున్నారు.