సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 4 జులై 2024 (17:49 IST)

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

Malvi Malhotra
Malvi Malhotra
రాజ్ తరుణ్ హీరోగా ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'తిరగబడరసామీ'. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ ట్రైలర్ పాటలకు రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా సినిమా విశేషాలని పంచుకున్నారు.
 
-మాది హిమాచల్ ప్రదేశ్. చదువుకోవడానికి ముంబై వెళ్లాను. అక్కడే థియేటర్ ఆర్ట్స్ లో చేరాను. టీవీ ఇండస్ట్రీ నుంచి నా కెరీర్ మొదలైయింది. తర్వాత ఓ హిందీ ఫిల్మ్ చేసే ఛాన్స్ వచ్చింది. అలాగే ఒక మలయాళం, తమిళ్ సినిమా చేశాను. ఇది తెలుగులో నా మొదటి సినిమా. 
 
- ఈ సినిమాలో బాలకృష్ణ గారి అభిమానిగా కనిపిస్తా. చాలా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్. చాలా ఎనర్జిటిక్ హైపర్ యాక్టివ్ అమ్మాయిగా కనిపిస్తాను. నా క్యారెక్టర్ కారణంగానే కథ అంతా జరుగుతుంది. ఇందులో ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా వుంటాయి, అలాగే నాకో యాక్షన్ సీక్వెన్స్ కూడా వుంది. అది బాలకృష్ణ గారికి రిలేట్ అయ్యేలా వుంటుంది. బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఫిల్టర్ వుండదు. ఆయన మనసులో వున్నది వున్నట్లుగా మాట్లాడేస్తారు. ఇందులో నా క్యారెక్టర్ కూడా అలానే వుంటుంది. నా క్యారెక్టర్ విమన్స్ కి సెల్ఫ్ డిఫెన్స్ ప్రాముఖ్యతని నేర్పించేలా వుంటుంది. తొలి సినిమాలోనే యాక్షన్ సీక్వెన్స్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. 
 
-బాలకృష్ణ గారి సినిమాలు చూస్తుంటాను. అన్ని ఇండస్ట్రీలలో ఆయనకి హ్యుజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఆయన చాలా సరదా వుంటారు. ఆయన గత చిత్రం భగవంత్ కేసరి ని చాలా ఎంజాయ్ చేశాను.  
 
- ఇందులో చాలా ఎమోషన్స్, యాక్షన్, డ్రామా, రోమాన్స్, ఫన్ ఇలా ఎలిమెంట్స్ వున్నాయి. ముఖ్యంగా రాజ్ తరుణ్ క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది. సైలెంట్ గా మొదలై వైలెంట్ గా మారే క్యారెక్టర్. ఆడియన్స్ ఎంజాయ్ చేసే అన్నీ ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి.
 
నిర్మాత మల్కాపురం శివకుమార్ వెరీ నైస్ పర్శన్. ఫ్యామిలీ పర్శన్ లా వుంటారు. వాళ్ళ అమ్మాయి నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేసినందుకు ఆయనకి రుణపడి వుంటాను. . 
 
- తెలుగు సినిమాలు చూస్తాను. బొమ్మరిల్లి, ఏం మాయ చేశావా నా ఫేవరేట్ ఫిలిమ్స్. రీసెంట్ గా బేబీ సినిమా చూశాను. రాజమౌళి గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల. అలాగే మణిరత్నం సార్ తో కూడా కలసి పని చేయాలని వుంది. 
 
- టాలీవుడ్ లో అందరు హీరోలు ఇష్టమే. అయితే ఒక థియేటర్ ఆర్టిస్ట్ గా యాక్టర్ కళ్ళలో డెప్త్ గురించి మాట్లాడుకుంటే .. నాని గారి పేరు చెప్తాను. తన కళ్ళతో అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్, ఎమోషన్స్ పలికించే యాక్టర్ తను. తనతో వర్క్ చేయడానికి ఇష్టపడతాను. అలాగే మహేష్ బాబు గారు, అడివి శేష్ గారు అంటే ఇష్టం.
-అన్ని జోనర్స్ ఇష్టమే. అయితే కథలో ప్రాధాన్యత వున్న పాత్రలు చేయడానికి ఇష్టపడతాను.