దావూద్ ఇబ్రహీంతో దీపికా, రణ్ వీర్ డిన్నర్ చేశారా? ఫోటో వైరల్
అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ ఆర్థిక రాజధాని కరాచీలోనే ఉన్నట్టు ఇటీవల పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో రణ్‌వీర్, దీపికా జంట గ్యాంగ్‌స్టర్ దావూద్‌తో కలిసి డిన్నర్ చేసారని ఫోటోని ప్రూఫ్‌గా చూపిస్తూ విపరీతంగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ విషయం బాలీవుడ్ నాట చర్చనీయాంశంగా మారింది.
ఈ ఫోటోలో దీపికా, రణ్‌వీర్, సందీప్, సంజయ్ లీలా భన్సాలీతోపాటు మరికొంత మంది ఉన్నారు. అందులో సందీప్ పక్కన కూర్చున్న వ్యక్తి దావూద్ అని .. జస్టిస్ ఫర్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ అనే పేరుతో క్రియేట్ అయిన ఓ గ్రూప్ పోస్ట్ చేసింది. 2013లో దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ జంటగా నటించిన 'గోలియోంకి రాస్‌లీలా రామ్‌లీలా' సినిమా షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఈ ఫోటో దిగగా, అందులో దావూద్ ఉన్నాడనే సరికి అందరూ షాకవుతున్నారు.
అసలు విషయం ఏమంటే ఈ ఫోటోని సందీప్ సింగ్ ఈ ఏడాది మేలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందులో ఉన్న వ్యక్తుల పేర్లు కూడా రాశాడు. ఆ ఫొటోలో దీపికా, రణ్‌వీర్, సంజయ్ లీలా భన్సాలీ , ఆర్ వర్మన్, వాసిక్ ఖాన్ తదితరులు ఉన్నారు. అయితే బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ వాసిక్ ఖాన్‌ని దావూద్ అంటూ ప్రచారం చేస్తుండడంతో దీపికా, రణ్‌వీర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.