సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (12:16 IST)

మన్మథుడు హీరోయిన్ అన్షు.. సినిమాలను ఎందుకు వదిలేసింది?

Anshu ambani
మన్మథుడు ఫేమ్ అన్షు సినిమాలను ఎందుకు వదిలేసిందో బయటపెట్టింది. ఇటీవల మన్మధుడు రీ-రిలీజ్‌ను స్వాగతించిన వీడియో క్లిప్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అన్షు మళ్లీ వెండితెరపై కనిపిస్తుందని అందరూ అనుకున్నారు. 
 
ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటించవచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే అన్షు సినిమాల నుంచి ఎందుకు వైదొలిగిందనే విషయాన్ని వెల్లడించింది. "రాఘవేంద్ర, మన్మథుడు రెండు చిత్రాల్లో నాకు చనిపోయే పాత్ర ఇచ్చారు. ఆ రెండు చిత్రాలతోనే నాకు చిరాకు పుట్టింది. అది చాలదు అన్నట్లు ఆ తర్వాత వచ్చిన ఆఫర్స్ కూడా చనిపోయే పాత్రలే. పదే పదే అలాంటి రోల్స్ ఆఫర్ చేయడంతో విసుగెత్తిపోయాను. ఏ నటికైనా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది. ఒకే రకమైన పాత్రలు చేయడం కంటే సినిమాలు మానేయడం బెటర్ అనిపించింది." అందుకే సినిమాలను వదులుకున్నానని అన్షు వెల్లడించింది. 
Manmathudu heroine Anshu
Manmathudu heroine Anshu
 
కెరీర్ ఆరంభం తాను చేసిన పాత్ర‌ల‌న్నీ సెకండ్ హీరోయిన్ వే కావ‌డంతో వాటితో విసుగొచ్చింద‌ని అన్షు వెల్ల‌డించింది. దాని కంటే సినిమాలు చేయ‌కుండా ఖాళీగా ఉండ‌ట‌మే న‌య‌మ‌ని భావించింద‌ట‌. 
 
కాగా మన్మథుడు ప్రభాస్ సరసన రాఘవేంద్ర చిత్రంలో నటించింది. తమిళ చిత్రం 'జై'లో ప్రధాన పాత్ర పోషించింది. తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సాధించినా పెళ్లి తర్వాత నటనను కొనసాగించలేదు. 
 
వ్యాపారవేత్త సచిన్‌ను పెళ్లాడిన అన్షు తన కుటుంబంతో కలిసి లండన్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. అన్షు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.