ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (09:19 IST)

అవకాశాల పేరుతో అవసరాలు తీర్చుకున్నాడు.. యువతి ఫిర్యాదు...

victim
సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని, ప్రేమిస్తున్నట్టు నమ్మించి తనను శారీరకంగా ఓ వ్యక్తి వాడుకున్నాడని పేర్కొంటూ ఓ యువతి బెగుళూరు పోలీసులుకు ఫిర్యాదు చేసింది. నిందితుడు కన్నడ, తమిళ సినిమాల్లో సహాయ నటుడుగా ఉన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాయచూరుకు చెందిన యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి గత 2019 నుంచి బెంగుళూరులో ఉంటుంది. హీరోయిన్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి, తన శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. మైసూరు, గోవా తదితర ప్రాంతాలకు తీసుకెళ్లాడు. తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్య కెమెరాతో శారీరకంగా కలిసివున్న సన్నివేశాలను చిత్రీకరించాడు. 
 
వాటిని అడ్డుపెట్టుకుని తన వద్ద నగదు, ఐఫోన్, ఆభరణాలు తీసుకున్నాడని పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పైగా, నిందితుడికి ఇప్పటికే వివాహమై అత్తిబెలెలో కాపురం ఉంటున్నట్టు తెలిపింది. ఇది తెలుసుకుని అతని వద్దకు వెళ్లి నిలదీయగా చంపేస్తానని బెదిరించాడని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఆమె అత్తిబెలె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందన రాకపోవడంతో ఆమె నేరుగా జ్ఞానభారతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు గతంలోనూ ఇదే తరహాలో వంచనకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ై
 
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్ కొత్త ప్లాన్స్ 
 
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్ కొత్త పాన్స్‌ను ప్రవేశపెట్టింది. గత కొంతకాలంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఆదరణ పెరుగుతున్న విషయం తెల్సిందే. అందుకు అనుగుణంగానే తమ ప్రీపెయిడ్ కష్టమర్ల కోసం టెలికాం కంపెనీలు వివిధ రకాలైన ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కంటెంట్‌ కోరుకునే వారి కోసం భారతీ ఎయిర్‌టెల్‌ రెండు పథకాలను అందిస్తోంది. వీటితో నచ్చిన సినిమాలు, టీవీ షోలు చూడొచ్చు. పైగా అపరిమిత 5జీ డేటా కూడా లభిస్తుంది. ఇవి కొత్తవి కాకపోయినప్పటికీ.. అవి అందిస్తున్న ప్రయోజనాలను పరిశీలిస్తే, 
 
ప్లాన్ ధర రూ.699 (ప్రీపెయిడ్‌ ప్లాన్‌) 
భారతీ ఎయిర్‌టెల్‌ యూజర్లు రూ.699తో రీఛార్జ్ చేస్తే అపరిమిత వాయిస్‌ కాలింగ్‌‌తో పాటు రోజుకు 3జీబీ డేటా, 100 ఎసెమ్మెస్‌లు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 56 రోజులు. ఈ ప్లాన్‌లో భాగంగా 56 రోజుల కాలపరిమితితో అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌, అపరిమిత 5జీ డేటా, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే, అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్స్‌, వింక్‌ మ్యూజిక్‌ సభ్యత్వం వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి.
 
ప్లాన్ ధర రూ.999 (ప్రీపెయిడ్‌ ప్లాన్‌)
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ కోరుకునే భారతీ ఎయిర్‌టెల్‌ యూజర్ల కోసం ఉన్న మరో ప్లాన్‌ రూ.999. దీంట్లో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌‌తో పాటు రోజుకు 2.5జీబీ డేటా, 100 ఎసెమ్మెస్‌లు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 84 రోజులు. అంతే కాలపరిమితితో అమెజాన్‌ ప్రైమ్‌ కంటెంట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే, రివార్డ్స్‌ మినీ సబ్‌స్క్రిప్షన్‌, అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్స్‌, వింక్‌ మ్యూజిక్‌ వంటి ప్రయోజనాలూ అందుతాయి.