శనివారం, 9 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (16:38 IST)

మార్చి 4న టెన్త్ క్లాస్ డైరీస్‌ అవికా గోర్ పరిచయ గీతం

Avika Gore
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు.  'రోజ్ విల్లా', 'ముగ్గురు మొనగాళ్లు' చిత్రాలను అచ్యుత రామారావు నిర్మించారు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'గరుడవేగ' అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాసరెడ్డి, 'వెన్నెల' రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, 'సత్యం' రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయిరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
 
మార్చి 4న సినిమా విడుదల కానుంది. ఈ రోజు కథానాయిక అవికా గోర్ పరిచయ గీతం 'ఎగిరే... ఎగిరే...'ను విడుద‌ల చేశారు. మ్యాచో స్టార్ రానా, కథానాయిక శ్రియ, సినిమాటోగ్రాఫర్ మది... ముగ్గురు ప్రముఖులు ఆన్‌లైన్‌లో పాటను విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి సంగీతంలో సురేష్ గంగుల రాసిన ఈ పాటను ప్రముఖ గాయని చిన్మయి పాడారు. విజయ్ బిన్నీ నృత్యరీతులు సమకూర్చారు. 
 
నిర్మాతల్లో ఒకరైన అచ్యుత రామారావు మాట్లాడుతూ "సినిమాలో అవికా గోర్ పరిచయ గీతం 'ఎగిరే... ఎగిరే...'ను ఈ రోజు విడుదల చేశాం. అమ్మాయి కలలు, కోరికలు, ఆశలు, ఆశయాలు... అన్నీ కలగలిపిన పాట ఇది. ఆన్‌లైన్‌లో సాంగ్ విడుదల చేసిన రానా, శ్రియ, మది గారికి థాంక్స్. కమర్షియల్ హంగులతో 'టెన్త్ క్లాస్ డైరీస్' తీర్చిదిద్దాం. సరికొత్త కాన్సెప్ట్ ఇది. టెన్త్ క్లాస్ నేపథ్యంలో సన్నివేశాలు  ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. మనం డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసినా... టెన్త్ క్లాస్ అనేది మెమరీ మైల్ స్టోన్ లాంటిది. ఆ మెమ‌రీస్ మిగ‌తా జీవితం మీద డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా ప్ర‌భావం చూపిస్తాయి. ఒక రకంగా లైఫ్ పార్ట్‌న‌ర్ లాంటిది. ఆ నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా, లైవ్లీగా సినిమాలో సన్నివేశాలు ఉంటాయి. ఇదొక మంచి కామెడీ ఎంటర్టైనర్. 'రోజ్ విల్లా', 'ముగ్గురు మొనగాళ్లు' తర్వాత ఈ సినిమాతో నిర్మాతగా మరో హిట్ అందుకుంటాననే నమ్మకం ఉంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజ‌ర్‌ను 15 లక్షల మంది చూశారు. మార్చి 4న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అని అన్నారు.
 
'గరుడవేగ' అంజి మాట్లాడుతూ "ప్రతి అమ్మాయి తనను తాను చూసుకునేలా ఈ పాట ఉంటుంది. జీవితంలో ఎన్నో ఆశలు, ఆశయాలతో ఉండే అమ్మాయిల మనోభావాలకు ప్రతిరూపం ఈ పాట. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. టీజ‌ర్‌కు 15 లక్షల వ్యూస్ రావడం సంతోషంగా ఉంది. సినిమా చిత్రీకరణ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. మార్చి 4న సినిమాను విడుదల చేస్తాం. ఛాయాగ్రాహకుడిగా నా 50వ చిత్రమిది" అన్నారు.