గురువారం, 31 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (16:58 IST)

రావణాసుర నుంచి మాస్ పార్టీ సాంగ్ డిక్కా డిష్యూం విడుదల

Ravanasura, Ravi Teja
Ravanasura, Ravi Teja
‘రావణాసుర’ టీజర్‌ తో  రవితేజని డిఫరెంట్ షేడ్స్ లో ప్రజంట్ చేసింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ చార్ట్ బస్టర్ నెంబర్స్ గా అలరిస్తున్నాయి.
 
ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన రావణాసుర మాస్ పార్టీ సాంగ్  డిక్కా డిష్యూం ని విడుదల చేశారు మేకర్స్. విన్న వెంటనే హై ఎనర్జీ ఇచ్చే మాస్ డ్యాన్సింగ్ పార్టీ నెంబర్ ఇది. రవితేజ చేసిన మాస్ మూమెంట్స్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాయి. కాసర్ల శ్యామ్ లిరిక్స్ పార్టీ మాస్ పార్టీ ఎలివేట్ చేస్తూ  క్యాచిగా ఆకట్టుకుంటే.. స్వాతి రెడ్డి యూకే, భీమ్స్ సిసిరోలియో, నరేష్ మామిండ్ల ముగ్గురూ కలసి ఈ పాటని హుషారుగా అలపించారు. థియేటర్ లో డిక్కా డిష్యూం మాస్ సందడి నెక్స్ట్ లెవల్ లో వుంటుందని ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. 
 
విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా యూనిక్ కథను అందించారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్.
ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ప్రపంచ వ్యాప్తంగా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కానుంది.