శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 20 మార్చి 2023 (16:33 IST)

చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చాను, ఎన్. టి.ఆర్. అంటే ఇష్టం : దక్షా నాగర్కర్

Daksha Nagarkar
Daksha Nagarkar
నేను ఎప్పుడూ కొత్తగానే చేయాలని ప్రయత్నిస్తాను. హోరాహోరిలో మెంటల్ డిస్టర్బ్ గా వుండే అమ్మాయి గా చేశాను. హుషారు లో దిల్ చహతహే తరహ పాత్ర, అలాగే జాంబిరెడ్డి తెలుగు లో మొదటి జాంబి ఫిల్మ్. రావణాసుర కూడా చాలా డిఫరెంట్ మూవీ. రావణాసురలో నా పాత్ర చూసి సర్ ప్రైజ్ అవుతారు అని హీరోయిన్ దక్షా నాగర్కర్ తెలిపింది. 
 
రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా 'రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ఈ చిత్రంలోని హీరోయిన్స్ లో ఒకరైన దక్షా నాగర్కర్ విలేఖరుల సమావేశంలో రావణాసుర విశేషాలని పంచుకున్నారు.
 
రావణాసుర ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
రావణాసుర కోసం నిర్మాత అప్రోచ్ అయ్యారు. మొదట ఇందులో పాత్ర లుక్ గురించి చెప్పారు. చాలా ఎక్సయిటింగా అనిపించింది. దర్శకుడు సుధీర్ వర్మ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం.  రవితేజ గారి సినిమాలో భాగం అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
 
దర్శకుడు సుధీర్ వర్మ ఈ కథని చెప్పినపుడు ఎలా ఫీలయ్యారు ?
సుధీర్ వర్మ గారి గత  చిత్రాలు చూశాను. చాలా డిఫరెంట్ గా వుంటాయి. రావణాసుర కథని కలర్ పేలేట్ తో సహా ఎలా వుంటుందో చెప్పారు. ఆయన చెబుతున్నపుడే ఒక సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఆయన డైరెక్షన్ లో పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది.
 
ఇందులో చాలా మంది హీరోయిన్స్ వున్నారు కదా.. మీ పాత్రకు ఎంత ప్రాధన్యత వుంటుందో అనే సందేహం రాలేదా ?
నాకు అలా ఏం అనిపించలేదు. నాకు ఒక పాత్ర ఇచ్చారు. ఆ పాత్రని ఎంత న్యాయం చేయగలనో అనే దానిపైనే ద్రుష్టిపెట్టాను. నా పాత్రతోనే ఇన్వాల్వ్ అయ్యాను.
 
రవితేజ గారు లాంటి పెద్ద స్టార్ తో పని చేయడం ఎలా అనిపించిది ? ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు ?
రవితేజ గారు బిగ్ స్టార్, మాస్ మహారాజా. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. చాలా హంబుల్ గా వుంటారు. సెట్స్ లో చాలా సరదా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం మంచి అనుభవం.
 
రావణాసుర బలాలు ఏమిటి ?
రవితేజ గారు, దర్శకుడు సుధీర్ వర్మ, సుశాంత్, డీవోపీ, మా టెక్నికల్ టీం ఇలా అందరం కష్టపడి ది బెస్ట్  ఇచ్చాం. 
 
సుశాంత్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
సుశాంత్ గారు చాలా సరదా మనిషి. ఈ సినిమాలో ఆయన్ని చాలా కొత్తగా చూస్తారు.
 
ఎలాంటి పాత్రలలో కనిపించాలని వుంది ?   
ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని వుంటుంది. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చాను. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. చాలా నేర్చుకోవాలి. ఇటివలే ఒక యాక్టింగ్ కోర్స్ కూడా చేశాను. 
 
తెలుగులో ఏ హీరోతో నటించడం అంటే ఇష్టం?
అందరి హీరోలతో కలసి పని చేయాలని వుంది. అని అన్నారు.  కానీ ఎన్. టి.ఆర్. నటన,  హావభావాలు,  డిక్షన్, తెలుగు ఉచ్చారణ నాకు బాగా నచ్చాయి. తనతో నటించాలని ఉంది.