ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 27 మార్చి 2023 (08:02 IST)

మీటర్ లో కిరణ్ అబ్బవరం, అతుల్య రవి పై మాస్ సాంగ్

Kiran Abbavaram and Atulya Ravi
Kiran Abbavaram and Atulya Ravi
హీరో కిరణ్ అబ్బవరం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్  ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో  క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. రెగ్యులర్ అప్‌డేట్‌లతో మీటర్ టీమ్ దూకుడు ప్రమోషన్‌లని చేస్తోంది . రెండు పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ రాగా, టీజర్ బజ్ పెంచింది.
 
ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. "మార్చి 29న ట్రైలర్ బ్లాస్టింగ్," అనే మాస్ అప్పిలింగ్ ట్రైలర్ డేట్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ పోస్టర్ లో డెనిమ్స్ షర్ట్స్ ,  జీన్స్ ధరించి, కిరణ్ మోడిష్‌గా కనిపిస్తున్నారు.
 
 మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రాఫర్ కాగా, జెవి ఆర్ట్ డైరెక్టర్. అలేఖ్య లైన్ ప్రొడ్యూసర్ కాగా, బాబా సాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కిరణ్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందిన ఈ చిత్రానికి బాల సుబ్రమణ్యం కెవివి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
 సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.