గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 6 ఆగస్టు 2022 (13:05 IST)

బింబిసార చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారో తెలుసా?

Chiranjeevi
కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం బింబిసార. ఈ చిత్రం సక్సెస్ టాక్ తో దూసుకెళ్తోంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ క్రమంగా పెరుగుతోంది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

 
ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడంలేదని బాధపడుతున్న సినీ పరిశ్రమకు శుక్రవారం విడుదలైన రెండు చిత్రాలు ఊరటనిచ్చాయని అన్నారు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజవైందన్నారు. బింబిసార, సీతారామం చిత్రం యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.