గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (19:18 IST)

అమీర్ ఖాన్‌లా నేను నటించలేను.. సో.. ఆయన చిత్రాలను రీమేక్ చేయను : చిరంజీవి

chiranjeevi
మిస్టర్ ఫర్ఫెక్ట్‌గా చిత్రపరిశ్రమలో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌లా తాను నటించలేనని, అందువల్ల ఆయన చిత్రాలను తాను రీమేక్ చేయబోనని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో చిరంజీవి ఇతర భాషలకు చెందిన చిత్రాలను తాను హీరోగా తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. 
 
అమీర్ ఖాన్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘లాల్‌ సింగ్‌ చడ్డా’. హాలీవుడ్‌లో సూపర్‌హిట్ అందుకున్న ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌గా ఇది సిద్ధమైంది. నాగచైతన్య కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ చిరంజీవి సమర్పణలో విడుదల కానుంది. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి, ఆమిర్‌ఖాన్‌, నాగచైతన్యలను నాగార్జున ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. 
 
దీనిలో నాగ్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఆమిర్‌ఖాన్‌, చిరు, చై సరదాగా సమాధానాలు చెప్పారు. తాను హోస్ట్‌గా ముగ్గురు స్టార్‌లను ఇంటర్వ్యూ చేయడం అద్భుతంగా ఉందని ఆయన తెలిపారు. అనంతరం నాగ్‌.. 'అవకాశం వస్తే ఆమిర్‌ నటించిన ఏ సినిమాలను మీరు రీమేక్‌ చేయాలనుకుంటున్నారు?' అని చిరుని ప్రశ్నించగా.. 'నో.. నేను చేయలేను' అని సమాధానమిచ్చారు. మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న అమీర్‌కు వృత్తిపట్ల ఉన్న నిబద్ధతను మెచ్చుకుంటూ చిరు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.