#HBDMegastarChiranjeevi ఏం జన్మసార్ మీది.. సూపర్
అలుపెరుగని స్వయంకృషికి అసలైన అర్థంగా నిలిచిన అభినయాచార్యుడు, స్వయంకృషికి పర్‌ఫెక్ట్ చిరునామా. కోట్లాది మందికి స్పూర్తిదాత మెగాస్టార్ చిరంజీవి నేడు 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు.
అలాంటి వారిలో కలెక్షన్ సింగ్ మోహన్ బాబు చేసిన ట్వీట్‌లో "చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్" అంటూ పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ చేస్తూ, 'స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగి, తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నె తెచ్చిన మీ సినీ ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. తెలుగింటి అభిమాన నటుడిగా ప్రజా హృదయాల్లో తనదైనముద్ర వేసుకున్న మిత్రులు, శ్రేయోభిలాషి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ పేర్కొన్నారు.
అలాగే ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్‌లో 'కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి చూస్తే చూడాలి మెగాస్టార్ సినిమా చూడాలి అని చిన్నప్పుడు అనుకునే నేను .ఇపుడు తీస్తే తీయాలిరా మెగాస్టార్ సినిమా తీయాలి అనిపిస్తుంది. ఏం జన్మ సార్ మీది.. సూపర్' పేర్కొన్నారు.