నకిలీ ఐడీతో మీరా చోప్రా వేక్సిన్; ఖండించిన చోప్రా
నటి మీరా చోప్రా `బంగారం`లో తెలుగు ప్రేక్షకులకు పరిచితమే. ఆమె బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించింది. తాజాగా ఆమె ఓ అపవాదును ఎదుర్కొంటోంది. నకిలీ ఐడీతో కరోనా వేక్సిన్ వేయించుకుందనేది ఆరోపణ. థానే మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఈ ఉదంతంపై థానే మున్సిపల్ కమిషీనర్ సందీప్ మాలయ్యా దీనిపై విచారణ జరిపి రుజువైతే క్రిమినల్ కేసు పెడతామని స్పష్టం చేశారు.
వివరాల్లోకి వెళితే, కోవిడ్ సెకండ్‌వేవ్ సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్‌కు కోవాక్సిన్ వేయిస్తుంది ప్రభుత్వం. ఇది థానే టిఎంసి పార్కింగ్ ప్లాజా సెంటర్లో "ఫ్రంట్‌లైన్ వర్కర్" ప్రాధాన్యత విభాగంలో టీకాలు వేయించుకుందట. థానేలోని ఓం సాయి ఆరోగ్యకేంద్రం సూపర్వైజర్గా మీరా చోప్రా ఫేక్ ఐడీ కార్డును సృష్టించి దాని ద్వార వేక్సిన్ వేయించుకుందట. ఈ విషయాన్ని బిజెపి నాయకులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై దానే మునిసిపల్ కార్పొరేషన్ విచారణకు ఆదేశించింది.
కాగా, తాజాగా ఈ ఆరోపణలను ఆమె ఖండించారు. కోవిడ్ సెండ్‌వేవ్ సమయంలో కేందప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందనీ, ఆసుప్రతిలో బెడ్లు, ఆక్సిజన్లు లేవని స్టేట్మెంట్ ఇచ్చింది. అలాంటప్పుడు ప్రజలు 18శాతం జీఎస్.టి. ఎందుకు కట్టాలని ప్రశ్నించింది. జీఎస్.టి.ని వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేసింది. దాని పర్యావసానమే ఆమెపై ఆరోఫణలు వస్తున్నాయని తెలుస్తోంది.