శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (16:55 IST)

మోనాల్‌ను బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేస్తారా..?

బిగ్ బాస్ నాలుగో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఒకానొక సమయంలో బిగ్‌బాస్ షో పై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ హౌజ్‌లో క్రమంగా ఇంట్రెస్టింగ్ టాస్కులు, లవ్ స్టోరీలు, గొడవలు, అల్లర్లు, అప్పుడప్పుడు గ్లామర్ షోలతో, ఎమోషన్స్‌తో బిగ్‌బాస్ మళ్లీ ప్రేక్షకులను షో వైపు మరల్చడంలో సక్సెస్ అవుతుంది. సీజన్-4లో నటి మోనాల్ తన అందచందాలతో కట్టిపడేస్తూ.. తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 
 
ఈ కారణంగానే మోనాల్‌ను కావాలనే ఎలిమినేట్ కాకుండా చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో కారణమేంటంటే.. బిగ్ బాస్ హౌస్ లో ఓ లవ్ స్టోరీ నడుస్తుండటం కూడా మోనాల్‌ను కాపాడానికి కారణంగా మరికొందరు చెప్పుకొస్తున్నారు. అసలు మోనాల్‌కు ఎన్ని ఓట్లు వచ్చాయో బయటపెట్టాలనీ, ప్రేక్షకుల ఓటింగ్‌తో పనిలేకుండా బిగ్‌బాస్ ఎలిమినేట్ చేసే ప్రకారమైతే ఇంత కథ ఎందుకంటూ బాహాటంగానే నెటిజనులు విమర్శలు సంధించారు. 
 
ఇక సోషల్ మీడియాలో రన్ అవుతున్న నెగిటివ్ కామెంట్స్‌ నుంచి తప్పించుకునేందుకు బిగ్‌బాస్ షో నిర్వాహకులు కచ్చితమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మోనాల్‌ను ఇంటి నుంచి పంపేద్దామని దాదాపు ఫిక్స్ అయినట్లు సమాచారం.