సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (12:42 IST)

వేగేశ్న సతీష్ కథలు (మీవి మావి) నుండి మోషన్ పోస్టర్

Sameer Vegeshna, Isha Rebba
`శతమానం భవతి` సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు వేగేశ్న సతీష్ 'కథలు (మీవి-మావి)' అనే వెబ్ సిరీస్‌తో త్వరలోనే OTT లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నుండి మొదటి కథ 'పడవ' మోషన్ పోస్టర్ విడుదలైంది. సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ 'పడవ' మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి దర్శకుడు వేగేశ్న సతీష్‌కి అలాగే టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
 
 దర్శకుడు వేగేశ్న సతీష్ తనయుడు హీరో సమీర్ వేగేశ్న , ఈషా రెబ్బ జంటగా నటించిన 'పడవ' ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. తాజాగా ఈ సిరీస్ నుండి మూడు కథలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మిగతా కథలు షూటింగ్ జరుపుకొనున్నాయి. త్వరలోనే వేగేశ్న సతీష్ 'కథలు' ఓ ప్రముఖ OTT సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 
 
సంగీతం : అనూప్ రూబెన్స్,  కెమెరా : దాము,  పాటలు : శ్రీమణి, ఎడిటింగ్ :  మధు, ఆర్ట్‌-రామాంజనేయులు, నిర్మాతలు : వేగేశ్న సతీష్ , దుష్యంత్,  రచన - దర్శకత్వం : వేగేశ్న సతీష్.