సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (12:00 IST)

నిద్ర లేకపోవడం ఓ జబ్బు... దయచేసి వైద్యం చేయించండి... ప్రకాష్ రాజ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోతారని, 22 గంటల పాటు దేశం కోసం పని చేస్తున్నారంటూ మహారాష్ట్ర బీజేపీ చీప్ చంద్రకాంత్ పాటి చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "దయచేసి కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి. నిద్రలేకపోవడం అనేది ఓ జబ్బు. వైద్య పరిభాషలో దీన్ని ఇన్సోమ్నియా అంటారు. దాని గురించి గొప్పులు చెప్పుకోవడం కాదు. ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి అని కామెంట్స్ చేశారు. దీంతో ఈ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది.