మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (16:42 IST)

సంక్రాంతి సీజన్‌లో సినిమా టికెట్ల రేట్లు పెరగనున్నాయ్

Sankranthi movies
Sankranthi movies
ఇటీవలే తెలంగాణలో సినిమా టికెట్ల పెంపుదలకు, బెనిఫిట్ షోలకు నో చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి ఎటువంటి వివరణ లేదు. కానీ తాజాగా ఎ.పి.లో సంక్రాంతి సీజన్‌లో సినిమా టికెట్ల రేట్లు పెరగనున్నాయ్అ ని తెలుస్తోంది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’.. నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’.. వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు రాబోతున్నాయి. వీటిపైనే సినిమా పెద్దలు, నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
విశ్వసనీయ సమాచారం మేరకు, ఏపీలో  గేమ్ ఛేంజర్ చిత్రానికి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.135, మల్టీప్లెక్స్‌లలో రూ.175 మేర టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఇక ఈ చిత్రానికి సంబంధించి బెనిఫిట్ షో టికెట్ రేట్లు రూ.600కు పెంచుకునే విధంగా ఉండబోతుంది. అలాగే ‘డాకు మహారాజ్’ చిత్రానికి సింగిల్ స్క్రీన్స్‌లో రూ.110, మల్టీప్లెక్స్‌లలో రూ.135 పెంపుకు అనుమతినిచ్చారు. ఈ చిత్ర బెనిఫిట్ షోకు రూ.500 మేర పెంపుకు అనుమతినిచ్చారు. మరో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’కి సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంపు ఉండనుంది. ఈసారి సంక్రాంతికి మూడు సినిమాల సక్సెస్ ఏ స్థాయిలో వుంటుందో చూడాలి. ఇక తెలంగాణాలో చివరి నిముషంలో పెంచే సూచనలు కూడాలేకపోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.