ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: గురువారం, 27 జులై 2017 (13:48 IST)

ఛార్మి బౌలింగ్‌కు ముద్రగడ క్లీన్ బౌల్డ్ ...ఎలాగంటే?

ఇదేంటి.. ఛార్మి బౌలింగ్ ఏంటి.. ముద్రగడ ఔట్ ఏంటనుకుంటున్నారా..? నిజమేనండి.. తన పాదయాత్రపై కోటి ఆశలు పెట్టుకుని ప్రభుత్వం దృష్టికి కాపుల సమస్యలను తీసుకెళ్ళాలనుకున్న ముద్రగడకు పెద్ద దెబ్బే తగిలింది. సరిగ్గా ముద్రగడ పాదయాత్ర రోజే ఛార్మి సిట్ ముందు హాజరవ్

ఇదేంటి.. ఛార్మి బౌలింగ్ ఏంటి.. ముద్రగడ ఔట్ ఏంటనుకుంటున్నారా..? నిజమేనండి.. తన పాదయాత్రపై కోటి ఆశలు పెట్టుకుని ప్రభుత్వం దృష్టికి కాపుల సమస్యలను తీసుకెళ్ళాలనుకున్న ముద్రగడకు పెద్ద దెబ్బే తగిలింది. సరిగ్గా ముద్రగడ పాదయాత్ర రోజే ఛార్మి సిట్ ముందు హాజరవ్వడంతో మీడియా మొత్తం ఆమెనే ఎక్కువగా కవర్ చేసింది.
 
ఉదయం 9 గంటల నుంచి ఛార్మి సిట్ కార్యాలయం నుంచి బయటకు వెళ్ళిన 4 గంటల వరకు ప్రతి బులిటెన్ లోనూ ఛార్మినే. ఛార్మిని సిట్ అధికారులు ఏం ప్రశ్నలు వేశారు. ఛార్మి ఎలా స్పందించారు.. ఛార్మి సిట్‌కు తెలిపిన సమాధానాలేమిటి.. ఇలా ఒక్కొక్కటిగా మీడియా చెబుతూ వచ్చింది తప్ప ముద్రగడను అస్సలు పట్టించుకోలేదు.
 
బులిటెన్‌లో ఏదో 20 సెకండ్ల వార్తను వేసి ఎత్తేశారు. దాంతోపాటు ముద్రగడను 24 గంటల పాటు నిర్భంధించారు పోలీసులు. వందలమంది పోలీసులు ముద్రగడ ఇంటి చుట్టూ మోహరించారు. ఆ వార్త పెద్దగా కవర్ కాలేదు.. దీంతో ముద్రగడ పద్మనాభం అనుకున్న ప్లాన్ మొత్తం నాశనమైపోయింది. దీంతో ముద్రగడ సైలెంట్‌గా ఇంట్లో కూర్చుండిపోయారు. కాపులందరూ ఛార్మి వ్యవహారంతోనే తమ ఉద్యమం వెనుకబడి పోయిందని చెవులు కొరుక్కున్నారు. అదేమరి ఛార్మి బౌలింగ్‌కు ముద్రగడ బౌల్డ్ అంటే.