మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 23 నవంబరు 2018 (15:02 IST)

చైత‌న్య-స‌మంత‌ల ఫ‌స్ట్ లుక్ అదిరింది, సమంతతో గోవా వెళ్లిన చైతు

అక్కినేని నాగ చైత‌న్య - స‌మంత క‌లిసి ఏమాయ చేసావే, మ‌నం, ఆటోన‌గ‌ర్ సూర్య చిత్రాల్లో న‌టించారు. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్న త‌ర్వాత వేరు వేరు సినిమాల్లో బిజీ అయ్యారు. ఇప్పుడు చైత‌న్య - స‌మంత క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దీనికి మ‌జిలి అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇదొక వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోంది. ఇటీవ‌ల వైజాగ్‌లో చైత‌న్య‌, స‌మంత‌లపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.
 
ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని టీమ్ హైద‌రాబాద్ చేరుకున్నారు. సింహాచ‌లం రైల్వే స్టేష‌న్లో చైత‌న్య‌, స‌మంత‌లపై కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఇదిలా ఉంటే... ఈరోజు నాగ చైత‌న్య పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు. మిడిల్ క్లాస్ కుర్రాడు ఎలా ఉంటాడో అలా చాలా రియ‌లిస్టిక్‌గా ఉన్నాడు చైత‌న్య ఈ ఫ‌స్ట్ లుక్‌లో. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫిబ్ర‌వ‌రికి షూటింగ్ కంప్లీట్ కానుంది. స‌మ్మ‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాతో అయినా చైత‌న్య‌కి మాంచి విజ‌యం వ‌స్తుంద‌ని ఆశిద్దాం.
 
ఇదిలావుంటే తన పుట్టినరోజు సందర్భంగా నాగచైతన్య తన భార్య సమంతను తీసుకుని గోవా వెళ్లాడు. అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాడట.