శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 21 నవంబరు 2018 (16:35 IST)

నాగచైత‌న్య ఆ బ్యాన‌ర్‌లో సినిమా చేస్తున్నాడా..?

అక్కినేని నాగచైత‌న్య ప్ర‌స్తుతం నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి మ‌జిలి అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌స్తుతం వైజాగ్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. సింహాచ‌లం రైల్వే స్టేష‌న్లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. నాగ చైత‌న్య‌, స‌మంత‌తో పాటు మ‌రి కొంత మంది ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ సినిమా త‌ర్వాత చైత‌న్య వెంకీ మామ సినిమా చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 
ఇదిలావుంటే... చైత‌న్య గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... యు.వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో చైత‌న్య ఓ సినిమా చేయనున్నాడ‌ట‌. ఈ చిత్రానికి మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ట‌. ఫుల్ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ సినిమా ఉంటుంద‌ట‌. మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్‌తో క‌లిసి యు.వి.క్రియేష‌న్స్ ఈ సినిమాని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంద‌ట‌. మ‌రి..త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో.