అశ్వద్ధామ ఎంతవరకు వచ్చాడు..?
యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం అశ్వద్ధామ. ఈ సినిమాని ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. నూతన దర్శకుడు రమణ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగ శౌర్య సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా విడుదలైన నిన్నే నిన్నే సాంగ్, టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ రెస్పాన్స్‌తో మరింత ఉత్సాహాంగా నాగశౌర్య డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకి హీరో నాగశౌర్య కథను రాయడం విశేషం. కేవలం యాక్షన్ ఎలిమెంట్సే కాదు.. మంచి మెసేజ్ ఉన్న చిత్రంగా సినిమాను రూపొందిస్తున్నారు. నాగశౌర్య డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి జనవరి 31న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పై నాగ శౌర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు.
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగ శౌర్య ఫలానా అబ్బాయ్ - ఫలానా అమ్మాయ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చి మరీ ఈ సినిమా చేసాడు. కెరీర్ ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడేలా భారీ విజయాన్ని అందిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు. మరి.. నాగ శౌర్యకి ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.