`లక్ష్యం` వైపు గురిపెడుతున్న నాగశౌర్య
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతోన్న నాగశౌర్య 20వ చిత్రం లక్ష్య. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్తలుక్‌లో కనిపించనున్నారు నాగశౌర్య.
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్రలలో విలక్షణ నటులు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ నటిస్తున్నారు.
ఈ చిత్రంలోని కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. నాగశౌర్యతో పాటు, జగపతి బాబు ఇతరనటులు ఈ షూట్ లో పాల్గొంటున్నారు. ప్రేక్షకుల మనసు గెలుచుకునే విధంగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ని లావీష్‌గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్.
ఈ సందర్భంగా విడుదలచేసిన మేకింగ్ వీడియోలో నాగశౌర్య తన లక్ష్యాన్నిఛేదించడానికి సిద్దమవడం మనం చూడొచ్చు. నిజానికి విలువిద్యకు తీక్షణమైన దృష్టి, క్రమశిక్షణ మరియు అగ్రశ్రేణి ఏకాగ్రత అవసరం.
నాగశౌర్య బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఇతర ప్రమోషనల్ కంటెంట్‌మీద అంఛనాలు పెరిగాయి.
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి
నిర్మాతలు: నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్, సినిమాటోగ్రాఫర్: రామ్‌రెడ్డి, సంగీతం: కాలబైరవ, ఎడిటర్: జునైద్ సిద్దిఖీ, డైలాగ్స్: సృజనమణి.