శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (17:22 IST)

నమిత -కుక్క మధ్య లవ్... భర్త తెగఫీలైపోతున్నాడట!

అటు ఓటీటీ పనులతో పాటు, ఇటు సినీ నిర్మాణ పనులను చూసుకోలేక నమిత మధ్యలో రెండిటినీ ఆపేసింది. మళ్ళీ ఆ పనులను మొదలుపెట్టడానికి కసరత్తులు స్టార్ట్ చేసింది. అందుకే ఈ బిజీ పనులతో ప్రస్తుతం తీరక లేకుండా గడుపుతుందట. దాంతో నమిత భర్త కొంచెం ఫీల్ అవుతున్నాడట. నమిత తనకు తగిన సమయాన్ని కేటాయించట్లేదు అంటూ తెగ బాధ పడుతున్నాడట.
 
ఎప్పుడు మేనేజర్లతోనే టైమ్ స్పెండ్ చేస్తోందని నమిత భర్త మొత్తానికి బాధ పడుతున్నాడు. ఇక నమిత ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై రాబోతున్న మొదటి సినిమా పేరు ఏమిటో తెలుసా ? 'బౌ.. వావ్'. ఇదేంటి ఇదేదో కుక్క సినిమాలా ఉంది అనిపిస్తోందా ? అవును, ఈ కథ కుక్కకి ఓ అమ్మాయికి మధ్య జరిగే కథ. కుక్క మనిషిలా ప్రవర్తిస్తే ఏమిటి ? అనే కోణంలో సినిమా ఉంటుంది.
 
ఇందులో నమితనే లీడ్ రోల్ చేస్తోంది. నమిత తర్వాత స్థానం కుక్కదే. మొత్తమ్మీద నమిత -కుక్క మధ్య లవ్ స్టోరీ అన్నమాట. పైగా ఈ సినిమాను 5-6 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. తన సొంత బ్యానర్ తో పాటు, దాని పై నిర్మిస్తున్న సినిమా కథలను నమిత చాలా కొత్తగా తీసుకుంటుంది. అన్నట్టు అమెజాన్ ప్రైమ్, ఆహాకు పోటీగా తాము కూడా సినిమాలు కొని స్ట్రీమింగ్ కు పెడతామని నమిత చెబుతుంది.