సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: శుక్రవారం, 15 జూన్ 2018 (17:32 IST)

నాని కొత్త సినిమా డైరెక్ట‌ర్ ఇత‌నే..!

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం నాగార్జున‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టిస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్లో అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయ‌

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం నాగార్జున‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టిస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్లో అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత నాని చేయ‌బోయే సినిమా గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే... మ‌ళ్లీ రావా డైరెక్ట‌ర్ తిన్ననూరి గౌతమ్‌తో సినిమా చేయ‌నున్నాడ‌ని.
 
కృష్ణార్జునయుద్ధం సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో ఆలోచ‌న‌లోప‌డ్డ నాని ఇక నుంచి ఆచితూచి సినిమాలు చేయాలి అనుకుంటున్నాడ‌ట‌. అందుక‌నే చాలామంది ద‌ర్శ‌కులు వెంట‌ప‌డుతున్న ఓకే చెప్ప‌డం లేద‌ట‌. ఇటీవ‌ల మ‌ళ్లీరావా డైరెక్ట‌ర్ నానికి క‌థ చెప్ప‌డం.. ఈ క‌థ విని నాని వెంట‌నే ఓకే చెప్పడం జ‌రిగింద‌ట‌. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మించ‌నుంది. హీరోయిన్ ఇంకా ఫైన‌ల్ కాలేద‌ని స‌మాచారం. మ‌ళ్లీ రావా అంటూ సున్నిత‌మైన ప్రేమ‌క‌థ‌ను చూపించిన గౌత‌మ్ ఈసారి ఎలాంటి ప్రేమ‌క‌థ‌ను చూపిస్తాడో..?