శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Srinivas
Last Modified: శుక్రవారం, 15 జూన్ 2018 (15:29 IST)

డైరెక్ట‌ర్ తేజ ఇంట్లో గోళ్లయితే గిల్లుకోవడం లేదు... మరేం చేస్తున్నారో తెలుసా?

చిత్రం అంటూ తొలి ప్ర‌య‌త్నంతో సంచ‌ల‌నం సృష్టించి... ఆ త‌ర్వాత నువ్వు నేను, జ‌యం చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన తేజ ఆ త‌ర్వాత కెరీర్లో వెన‌బ‌డ్డాడు. ఇటీవ‌ల నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఫామ్‌లోకి వ‌చ్చి.. బాల‌య్య‌తో ఓ సినిమా, వెంకీతో ఓ సినిమా చేస

చిత్రం అంటూ తొలి ప్ర‌య‌త్నంతో సంచ‌ల‌నం సృష్టించి... ఆ త‌ర్వాత నువ్వు నేను, జ‌యం చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన తేజ ఆ త‌ర్వాత కెరీర్లో వెన‌బ‌డ్డాడు. ఇటీవ‌ల నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఫామ్‌లోకి వ‌చ్చి.. బాల‌య్య‌తో ఓ సినిమా, వెంకీతో ఓ సినిమా చేసే ఛాన్స్ ద‌క్కించుకుని వార్త‌ల్లో నిలిచాడు. అయితే... అనుకోకుండా ఈ రెండు ప్రాజెక్టులు మిస్ అయ్యాయి. దీంతో తేజ  ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారు అనేది ఆస‌క్తిగా మారింది. ఏ సినిమా షూటింగులో లేకపోతే చాలామంది ఇంట్లో గోళ్లు గిల్లుకుంటున్నారంటూ కామెంట్లు వేస్తారు. ఐతే తేజ మాత్రం గోళ్లయితే గిల్లుకోవడం లేదట.
 
విష‌యం ఏంటంటే... రెండు ప్రాజెక్టులు మిస్ చేసుకున్న తేజ వ‌ద్ద ఇప్పుడు మూడు ప్రాజెక్టులు ఉన్నాయ‌ట‌. అయితే... ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఆ మూడు ప్రాజెక్టులు ఏంటంటే... నిర్మాత దాన‌య్య త‌న కొడుకును హీరోగా ప‌రిచ‌యం చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ బాధ్య‌త‌ను తేజకి అప్ప‌గించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక రెండో ప్రాజెక్ట్ నేచుర‌ల్ స్టార్ నానితో అని స‌మాచారం. ఇక మూడో ప్రాజెక్ట్ రానాతో. మ‌రి... ఈ మూడు ప్రాజెక్టుల‌లో ఏ ప్రాజెక్ట్ ముందుగా సెట్స్ పైకి వెళుతుందో..?