బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 12 జూన్ 2018 (20:00 IST)

నేల టిక్కెట్టు ప్లాఫ్... నాగ్ ఆఫీసర్ దెబ్బేసింది... మ‌రి బంగార్రాజు ఉన్న‌ట్టా? లేన‌ట్టా?

సోగ్గాడే చిన్ని నాయ‌నా, రారండోయ్ వేడుక చూద్దాం... చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించి అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌. మూడ‌వ చిత్రంగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో తెర‌కెక్కించిన నేల టిక్కెట్టు సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో క‌ళ్యాణ్ కృష

సోగ్గాడే చిన్ని నాయ‌నా, రారండోయ్ వేడుక చూద్దాం... చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించి అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌. మూడ‌వ చిత్రంగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో తెర‌కెక్కించిన నేల టిక్కెట్టు సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో క‌ళ్యాణ్ కృష్ణ నాగ్‌తో చేయాల‌నుకున్న బంగ‌ర్రాజు సినిమా ఉన్న‌ట్టా..? లేన‌ట్టా..? అనేది ఓ పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. 
 
అయితే.. క‌ళ్యాణ్ కృష్ణ‌ని అడిగితే మాత్రం నాగ్‌తో బంగార్రాజు ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఫుల్ స్ర్కిప్ట్ రెడీ అయ్యింది. త్వ‌ర‌లోనే నాగార్జున గారికి స్టోరీ నెరేష‌న్ ఇవ్వ‌బోతున్నాను అని మీడియాకి తెలియ‌చేసాడు క‌ళ్యాణ్ కృష్ణ‌. నాగార్జున  ప్ర‌స్తుతం నానితో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్‌లో నటిస్తోన్న విష‌యం తెలిసిందే. 
 
ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ అధినేత అశ్వ‌నీద‌త్ నిర్మిస్తోన్న ఈ సినిమా హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అసలే వర్మ షాక్‌కి దెబ్బయిపోయిన నాగార్జున‌ బంగార్రాజుకి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారో లేదో చూడాలి.