1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (16:09 IST)

యాక్షన్‌ థ్రిల్లర్‌గా నరకాసుర సిద్దమవుతుంది

Rakshit Atluri, Aparna
Rakshit Atluri, Aparna
రక్షిత్‌ అట్లూరి, అపర్ణా జనార్థన్‌, సంకీర్తన విపిన్‌, శత్రు కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్‌ దర్శకత్వంలో సుముఖ క్రియేషన్స్‌, ఐడియల్‌ ఫిల్మ్‌ మేకర్స్‌పై ఆజ్జా శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ చూసిన పలువురు సినీ ప్రముఖులు ‘కాంతారా రేంజ్‌లో ఉందని’ ప్రశంసించారు. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ రెండో వారంలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
‘నరకాసుర’ అనే రాక్షసుడి జననం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది.’ అని దర్శకుడు అన్నారు.సెప్టెంబర్‌ రెండో వారంలో  ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని నిర్మాత తెలిపారు. ఈ సినిమాలో  నాజర్‌, చరణ్‌రాజ్‌, శ్రీమాన్‌, ఎస్‌ఎస్‌ కాంచీ, గాయత్రి రవిశంకర్‌, తేజ్‌ చరణ్‌రాజ్‌, కార్తిక్‌ సాహస్‌, రాజారావు, ఫిష్‌ వెంకట్‌, మస్త్‌ అలీ, భానుతేజ, లక్ష్మణ్‌, రాము, దేవంగన, పింటు శర్మ, ప్రమోద్‌, చతుర్వేది తదితరులు నటించారు.