శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (09:06 IST)

చిరంజీవి అలాంటోడు కాదు.. ప్లీజ్... అలా రాయొద్దు : జీవిత రాజశేఖర్

తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో సీనియర్ నటుడు శివాజీరాజా, నరేష్‌లతో పాటు.. వారివారి ప్యానెల్ తరపున పోటీ చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల సంగంతి అటుంచితే మెగాస్టార్ చిరంజీవిపై మీడియాలో ఓ దుష్ప్రచారం సాగుతోంది. దీన్ని హీరోయిన్ జీవితా రాజశేఖర్ ఖండించారు. ఈమె హీరో నరేష్ ప్యానెల్ తరపున మా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు. ఈ ప్యానెల్ సభ్యులు ఇటీవల చిరంజీవిని కలిసి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కారణంగానే చిరంజీవిపై వివిధ రకాల గాసిప్స్ వస్తున్నాయి.
 
వీటిపై జీవిత రాజశేఖర్ స్పందించారు.  మా ఎన్నికల గురించి మీడియాలో వస్తున్న వార్తలు చాలా బాధకు గురిచేశాయన్నారు. మీడియాలో వచ్చే వార్తల కారణంగా ఇండస్ట్రీలో కలుషిత వాతావరణం నెలకొంటుందన్నారు. ఈ విషయంలో చిరంజీవి పేరు రావడం చాలా బాధగా ఉందన్నారు. 
 
మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న హీరో నరేష్ ప్యానెల్‌కు చిరంజీవి సపోర్ట్ లేదని, తన మాటను ధిక్కరించారన్న కారణంగా నరేష్‌కు మెగాస్టార్ మద్దతు ఇవ్వడం లేదంటూ మీడియాలో ఇష్టంవచ్చినట్టు రాస్తున్నారని, ఇది సభ్యతకాదంటూ ఆమె మండిపడ్డారు. వాస్తవానికి చిరంజీవి ఎవరికీ సపోర్ట్ చేయడంలేదని, ఎవరు గెలిచినా అందరం కలిసి పనిచేద్దామని మాత్రమే ఆయన అన్నారని జీవిత స్పష్టం చేశారు. సభ్యుల ఏకగ్రీవం కుదరని కారణంగానే తాము ఎన్నికల్లో పోటీ చేయాల్సివస్తోంది తప్ప తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని జీవిత స్పష్టంచేశారు.