శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 3 జనవరి 2019 (20:08 IST)

వయస్సుకొచ్చానని ట్రీట్ ఇచ్చిన హీరోయిన్...

తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నయనతార. తమిళంలో అగ్రహీరోయిన్లలో ఒకరుగా ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉన్నారు. అటు యువ హీరోలు, ఇటు సీనియర్ హీరోలు అందరితో నటించి ప్రేక్షకులందరినీ మెప్పించింది నయనతార. అయితే తాజాగా తెలుగులో సైరాలో నటిస్తున్నారు. అటు తమిళ చిత్రాల్లో కూడా నయనతార బిజీగా ఉన్నారు. 
 
అయితే సినిమాల్లోకి వచ్చి నయనతారకు 15 యేళ్ళు అవుతోందట. దీంతో నయనతార ఎంతో ఆనందంగా ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేసింది. అంతేకాదు తన స్నేహితులకు పెద్ద ట్రీట్ ఇచ్చింది. ముందుగా స్నేహితులకు ట్రీట్ ఎందుకు ఇస్తున్నానన్న విషయాన్ని నయనతార చెప్పలేదు. 
 
సాయంత్రంవేళ జాలీగా ట్రీట్ ఇస్తూ నేను సినీ పరిశ్రమలో 15 యేళ్ళు పూర్తిచేసుకున్నాను. నా వయస్సు 15 యేళ్ళు అంటూ నవ్వుతూ స్నేహితులకు ట్రీట్ ఇచ్చింది. నీ వయస్సు 15 యేళ్ళా అంటూ స్నేహితులు పక్కున నవ్వారట.