Daily Horoscope
✕

Nayanatara: మహాశక్తి సినిమా కోసం ప్రమోషన్ చేస్తూ దైవిక ఆశీస్సులు కోరుతున్న నయనతార

Written By దేవీ
Updated: మంగళవారం, 3 నవంబరు 2026 (20:04 IST)
Nayanatra pooja publicity
ఎప్పుడూ సినిమా ప్రమోషన్ లకు రాని నయనతార తన సినిమా విడుదల ఇంకా మూడు రోజులుందనగా అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ఫొటోలను షేర్ చేసింది. తాను నటించిన మహాశక్తి చిత్రానికి ముందు, తన ఆధ్యాత్మిక ప్రయాణంలోని ఒక ఘట్టాన్ని పంచుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతార పంచుకున్నారు. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2026 నవంబర్ 6న, దీపావళి కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
చెన్నైలోని ప్రసిద్ధ కాళికాంబళ్ ఆలయాన్ని నయనతార సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వాదంతో సినిమా ప్రమోషన్స్, విడుదల ఏర్పాట్లు జోరందుకున్నాయి.
 
2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ్ ఫాంటసీ భక్తి థ్రిల్లర్ చిత్రం మూకుత్తి అమ్మన్. ఈ సినిమాకి సీక్వెల్ గా మూకుత్తి అమ్మన్ 2 పేరిట నవంబర్ 6వ తేదీన దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. పైగా ఈ చిత్రానికి సుందర్. సి దర్శకత్వం వహిస్తుండడం, అటు రెజీనా కసాండ్రా విలన్ పాత్ర పోషిస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పైగా దునియా విజయ్ కూడా ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఊర్వశి, యోగి బాబు, అభినయ, రామచంద్రరాజు, స్నేహ , మీనా లాంటి భారీ తారాగణం ఇందులో భాగమవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
 
చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన దర్శకుడు సినిమా కోసం పనిచేసిన సాంకేతిక నిపుణుల కష్టాన్ని గుర్తించాలని కోరారు. దాదాపు 400 మంది సీజీఐ కళాకారులు ఏడాదిన్నర పాటు రాత్రింబవళ్లు శ్రమించి ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించారని తెలిపారు..
 
ఈ సినిమాలో మొత్తం 3,000 సీజీఐ షాట్లు ఉన్నాయని, వాటిలో కేవలం 15 షాట్లకు మాత్రమే ఏఐ టెక్నాలజీని ఉపయోగించినట్లు స్పష్టం చేశారు. మిగిలిన విజువల్స్ అన్నింటినీ టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి రూపొందించారని తెలిపారు. 
About Author
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

గుంటూరు మేయర్ పీఠంపై నటుడు జగపతిబాబు సోదరి - కుప్పంలో వైకాపాకు సున్నా

ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు ప్రజలకు ఉంటుంది : మద్రాస్ హైకోర్టు

ఇది చూస్తే పవన్ కల్యాణ్‌కి పూనకాలే, ఆదోనిలో జనసేన రెబల్ స్టార్, వీడియో

భారత్ లౌకిక దేశం : ఆ నటి వీడియోను మళ్లీ అప్‌లోడ్ చేయండి : బాంబే హైకోర్టు ఆదేశం

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలకే తొలి ప్రాధాన్యత : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు

మలబద్ధకం నుంచి ఉపశమనం: కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్‌

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?

విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం

కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్‌కు చికిత్స

తర్వాతి కథనం
Show comments