సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 అక్టోబరు 2021 (15:32 IST)

మీరు గర్వించేలా నడుచుకుంటా : కౌన్సెలింగ్‌లో ఆర్యన్ ఖాన్

డ్ర‌గ్స్ కేసులో అరెస్ట‌యి, ప్ర‌స్తుతం ముంబైలోని ఆర్థ‌ర్ రోడ్ జైల్లో ఉంటున్న బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కౌన్సెలింగ్ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా ఎన్సీబీ జోన‌ల్ డైరెక్టర్ స‌మీర్ వాంఖెడె అత‌నితో మాట్లాడారు. జైలు నుంచి రిలీజైన త‌ర్వాత తాను మంచి ప‌ని చేసి, మిమ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేస్తాన‌ని సమీర్ వాంఖెడెకు ఆర్య‌న్ ఖాన్ చెప్పిన‌ట్లు ఓ అధికారి వెల్ల‌డించారు. 
 
రిలీజ్ అయిన త‌ర్వాత పేద‌ల‌ను సామాజికంగా, ఆర్థికంగా ఆదుకునే దిశ‌గా తాను ప‌ని చేస్తాన‌ని ఆర్య‌న్ చెప్పాడు. ఇలాంటి ప్ర‌తికూల అంశాల‌తో ప‌బ్లిసిటీ వ‌చ్చే ఏ ప‌నీ తాను చేయ‌బోన‌ని అత‌డు మాట ఇచ్చిన‌ట్లు ఆ అధికారి చెప్పారు. ఆర్య‌న్ ఖాన్ వేసిన బెయిల్ పిటిష‌న్‌పై ఈ నెల 20వ తేదీన ప్ర‌త్యేక కోర్టు తీర్పు వెల్ల‌డించ‌నుంది.