బుధవారం, 13 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (22:46 IST)

సిగ్నేచర్ స్టెప్స్‌తో ఇరగదీసిన మెగా డాటర్

Niharika
Niharika
మెగా డాటర్ నిహారిక పెళ్లయిన తర్వాత కూడా వెబ్ సిరీస్‌లను నిర్మిస్తూ నిర్మాతగా మారారు. కెరియర్‌లో ఎంతో సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా నిహారిక ఎన్నో ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు. 
 
ఈ క్రమంలోనే తాజాగా ఈమె కొరియోగ్రాఫర్ మృణాళిని కిరణ్‌తో కలిసి ప్రస్తుతం విడుదలైన సినిమాలలో పలు పాటలకు సిగ్నేచర్ స్టెప్స్ చేస్తూ అదిరిపోయే డాన్స్ చేశారు.
 
ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో రారా సామి, ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు, బుల్లెట్ బండి, బీస్ట్ సినిమాలో పాటకు, రాను రాను అంటుందో చిన్నదో అనే పాటలకు సిగ్నేచర్ స్టెప్స్ చేస్తూ అదిరిపోయి పర్ఫామెన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.