బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 18 మే 2018 (14:52 IST)

''శ్రీనివాస కల్యాణం'' చూడాలంటే.. ఆగస్టు 9వరకు ఆగాల్సిందే..

నితిన్ హీరోగా నటించే శ్రీనివాస కల్యాణం సినిమా కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సతీశ్ వేగేశ్న (శతమానం భవతి ఫేమ్) రూపొందించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.

నితిన్ హీరోగా నటించే శ్రీనివాస కల్యాణం సినిమా కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సతీశ్ వేగేశ్న (శతమానం భవతి ఫేమ్) రూపొందించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. నితిన్, రాశిఖన్నా జంటగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాదు, ఆపై అమలాపురంలో జరిగే షూటింగ్‌తో ఈ సినిమా పూర్తవుతుంది. 
 
ఈ షెడ్యూల్ తో ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తవుతుంది. దిల్ రాజు నిర్మాణంలో క్రితం ఏడాది జూలై 21వ తేదీన వచ్చిన 'ఫిదా' ఘన విజయాన్ని సాధించింది. అందువలన ఆ సెంటిమెంట్‌తో అదే రోజున 'శ్రీనివాస కల్యాణం'ను విడుదల చేయాలని భావించారు. 
 
కానీ కొన్ని కారణాల వల్ల దిల్ రాజు ఆ సెంటిమెంట్‌ను పక్కనబెట్టి.. ఆగస్టు 9వతేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సో.. శ్రీనివాస కల్యాణం చూడాలంటే.. ఆగస్టు 9వరకు ఆగాల్సిందేనన్న మాట..!