Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

నితిన్ పెళ్లి కానుకగా విడుదల అయిన 'రంగ్ దే' దృశ్య మాలిక

Written By శ్రీ
Updated: సోమవారం, 27 జులై 2020 (17:43 IST)
యువ కథానాయకుడు 'నితిన్', మహానటి 'కీర్తి సురేష్'ల తొలి కాంబినేషన్లో ప్రసిద్ధ చలనచిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తున్న చిత్రం 'రంగ్ దే'. 'తొలిప్రేమ','మిస్టర్ మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభ గల యువ దర్శకుడు 'వెంకీ అట్లూరి' దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పి.డి.వి. ప్రసాద్ చిత్ర సమర్పకులు.

" పెళ్లికొడుకెక్కడ... 
హి ఈజ్ మై బాయ్ ఫ్రెండ్.. 
అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు.. 
అర్జున్.. ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఇద్దరి ఫ్యూచర్ దృష్ట్యా 'అను'ని నువ్వు పెళ్లి చేసుకోవటమే నాకు న్యాయం అనిపిస్తోంది. 
చెయ్ తియ్ జస్టిస్ చౌదరి... 
ఏంటి మావయ్య.. నీ బతుకు ఇలా అయిపొయింది.
 
ఏరా...ఏడుస్తున్నావా.... మరి పెట్టు.. 
'నాన్నా.. నవ్వుతోంది... నేను కట్టలేను నాన్నా'
 అనే సందర్భానుసారంగా సాగే సంభాషణలతో పాటు
 'బస్టాండే బస్టాండే... ఇక బతుకే బస్టాండే అనే సాహిత్యంతో కూడిన బీజియంతో ఈ దృశ్య మాలిక ముగుస్తుంది. హీరో నితిన్ వివాహమహోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రం యూనిట్ ఈ దృశ్య మాలికను విడుదల చేసింది.
 
'ప్రేమ'తో కూడిన కుటుంబ కథా చిత్రం 'రంగ్ దే'. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి. శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 2021 సంక్రాంతి  కానుకగా చిత్రం విడుదల అవుతుందన్నట్లుగా ఈ టీజర్లో కనిపిస్తుంది.
 
నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ 'రంగ్ దే' చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే: సతీష్ చంద్ర పాశం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ , రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments