మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 డిశెంబరు 2019 (16:14 IST)

ట్రిపుల్‌ఆర్ ఫోటోలు-సోషల్ మీడియాలో వైరల్.. ఎన్టీఆర్, చెర్రీ లుక్ ఇదే..

ట్రిపుల్‌ఆర్ సినిమాకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. జూలైలో సినిమా విడుద‌ల అవుతుంద‌ని వార్తలు వస్తున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో చిత్ర షూటింగ్ జ‌ర‌ప‌గా, ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్‌కి సంబంధించిన ఓ వీడియో లీకైంది.
 
ఇందులో ఎన్టీఆర్ కొమురం భీం గెట‌ప్‌లో క‌నిపించి అల‌రించాడు. ఇక తాజాగా ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ఒకే ఫ్రేములో క‌నిపించి ప్రేక్ష‌కుల‌కి మంచి కిక్ ఇస్తున్నారు. ఓ అభిమానితో వీరిద్ద‌రు క‌లిసి ఉన్న ఫోటోతో పాటు బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌స్తుతం వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. 
 
ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ చిత్రం రూపొందుతుండ‌గా, ఇందులో ఒలివీయా, అలియాభ‌ట్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. జ‌న‌వ‌రి నుండి చిత్ర ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టాల‌ని జ‌క్క‌న్న భావిస్తుండ‌గా, సినిమాలోని పాత్ర‌ల‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుండి ఈ చిత్రం ఆర్ఆర్ఆర్ అనే పేరుతోనే ప్ర‌చారం జ‌రుపుకుంటుంది.