Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

NTR Clarity: ఎన్.టి.ఆర్.పై వస్తున్న వార్తలకు ఎన్టీఆర్ కార్యాలయం వివరణ

Written By దేవీ
Updated: మంగళవారం, 14 జులై 2026 (14:30 IST)
NTR wishes fans
14-7-26,  మంగళవారం.. శ్రీ ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన
RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ, శ్రీ ఎన్టీఆర్ గారితో సంబంధం ఉన్నట్టుగా ప్రజల్లో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది.
 
ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయదలచుకున్నది ఏమనగా, శ్రీ ఎన్టీఆర్ గారికి గానీ, ఆయన కార్యాలయానికి గానీ, RAW NTR అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదు. ఆ సంస్థకు శ్రీ ఎన్టీఆర్ గారి తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే, ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారమూ లేదు.
 
శ్రీ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం శ్రీ ఎన్టీఆర్ గారు లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ప్రచారం చేయబడే సమాచారం, ప్రకటనలు లేదా కార్యక్రమాలను అధికారికమైనవిగా లేదా విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దని మనవి.
 
ఈ అంశంపై ఇదే మా తరఫున తుది వివరణ. దీనితో ఈ విషయానికి సంబంధించిన అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు పూర్తిగా ముగింపు పలుకుతాయని ఆశిస్తున్నాము.
 
అలాగే, సంప్రదాయ మీడియా, డిజిటల్ మరియు సోషల్ మీడియా వేదికలు, అలాగే శ్రీ ఎన్టీఆర్ గారి అభిమానులు, శ్రేయోభిలాషులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా, అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
 
మీ సహకారానికి, అలాగే శ్రీ ఎన్టీఆర్ గారిపై మీరు చూపుతున్న నిరంతర అభిమానానికి, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
About Author
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

చావంటే భయంలేదు.. ఫ్లైట్‌ను కూల్చివేయాలన్నదే ప్లాన్ : ఫ్లైదుబాయ్ కో కెప్టెన్ వాంగ్మూలం

సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు - విచారణకు కేరళ సర్కారు ఆదేశం

రిజర్వేషన్లు వ్యతిరేకించేవారు అగ్రవర్ణ ప్రజలు పారిశుద్ధ్య పనులు చేయండి: గుజరాత్ మాజీ సీఎం వాఘేలా

ఢిల్లీ జంతర్ మంతర్ ఆందోళన : మహిళా జర్నలిస్టులకు లైంగిక వేధింపులు

ఖరీదైన చీరలు చోరీ చేసిన దొంగలు.. వార్తలకు భయపడి కొరియచేశారు...

అన్నీ చూడండి

LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు

టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు

గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్

bad cholesterol, చెడు కొవ్వు కరిగించే పదార్థాలు

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్‌నెస్

తర్వాతి కథనం
Show comments