సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 16 జులై 2022 (18:03 IST)

కొత్తదనంతో తీస్తే ఆదరిస్తారని మరోసారి నిరూపించారు- వర్మ

Ramasatyanarayana, Ram Gopal Varma, T. Anjaya
Ramasatyanarayana, Ram Gopal Varma, T. Anjaya
`పూజా భాలేకర్ లాంటి మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయి దేశంలోనే లేరు. కొత్త జానర్‌లో సినిమాను ప్రయత్నించాం. కొత్తదనంతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మళ్లీ ‘అమ్మాయి’ సినిమాతో నిరూపించారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రాపర్ సక్సెస్ మీట్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామ’ని  రామ్ గోపాల్ వర్మ అన్నారు.
 
టి. అంజయ్య, శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఇండో, చైనీస్ కో ప్రొడక్షన్స్, పారిజాత క్రియేషన్స్, ఆర్ట్సీ మీడియా పతాకాలపై పూజా భాలేకర్ ప్రధాన పాత్రలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఇండియాస్ ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఫిలిం ‘లడ్కీ’ (తెలుగులో ‘అమ్మాయి‘). ఈ నెల 15 న ప్రపంచ వ్యాప్తంగా 47,000 స్క్రీన్ లలో విడుదలైంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, సక్సెస్ అవ్వడంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుతున్నారు. ఇక సినిమా విజయవంతంగా ప్రదర్శించబడు తుండటంతో చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది.
 
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ..   రామసత్యనారాయణ గారికి ఈ సినిమాతో ఏ సంబంధం లేకపోయినా కూడా మాకు ఎంతో సహాయం చేశారు. ఆయన మా శ్రేయోభిలాషిగా ఈ సినిమా కోసం ఎంతో పని చేశారు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎన్నోసార్లు చెప్పాను. ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూసినప్పటి నుంచీ అలాంటిది ఒకటి చేయాలని అనుకున్నాను. 
 
 రామసత్యనారాయణ మాట్లాడుతూ..* ‘అమ్మాయి లాంటి మంచి చిత్రాన్ని నిర్మించినందుకు ఆర్జీవీ గారికి, వెనుకుండి సపోర్ట్ ఇచ్చిన మా అంజన్నని అభినందిస్తున్నాను. మా అంజన్న ఐదు సినిమాలు తీశారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాం. ఇక రేపటి నుంచి ఏపీలో మరో వంద థియేటర్లు పెంచుతున్నారని చెప్పడం కోసం మీడియా ముందుకు వచ్చాం. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఆర్జీవీ. చైనాలో 40 శాతం అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. మొదటి రోజే రూ. 150 కోట్లు కలెక్ట్ చేసింది జర్నలిస్ట్ మిత్రుడు చెప్పారు. అన్ని చోట్లా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. పూజా బాగా నటించింది. ఇప్పటికే ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు ఆర్జీవీ గారు, అంజన్న గారికి థ్యాంక్స్’ అని అన్నారు.
 
నిర్మాత టి. అంజయ్య మాట్లాడుతూ, ‘ఆర్జీవీ గారికి థ్యాంక్స్. ఆయనతో నాది ఐదేళ్ల ప్రయాణం. ఈ చిత్రం ఆయనకు మానసిక పుత్రిక. సినిమాను చూస్తూ అందరూ చొక్కాలు చించుకుంటున్నారు. శివ తరువాత ఈ సినిమానే అంత పెద్ద హిట్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయమని అంటున్నారు. ఆ చిత్రాన్ని కూడా నేనే నిర్మిస్తాను. ఎంతో పెద్ద సక్సెస్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా కూడా ఆర్జీవీ ముందుకు వెళ్తూనే ఉంటారు. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్’ అని అన్నారు.