శనివారం, 9 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (19:05 IST)

కాశ్మీర్ వెళుతున్న ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ చిత్రం

Yaswant, Ananya
Yaswant, Ananya
యస్వంత్ , జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ నటీనటులుగా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తుమ్మల ప్రసన్నకుమార్ నిర్మిస్తున్న చిత్రం "ఊ అంటావా మావా ఊఊ  అంటావా మావ". ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుని రెండు పాటల షూట్ కొరకు కాశ్మీర్ కు వెళుతున్న సందర్బంగా చిత్ర యూనిట్  హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో సినీ అతిరదుల మధ్య  టైటిల్ అనౌన్స్ మెంట్ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ, ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్ లు "ఊ అంటావా మావ ఊఊ  అంటావా మావ" చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో  నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకులు అజయ్  కుమార్, రాజా వన్నెం రెడ్డి, సత్య ప్రకాష్, ఆచంట గోపినాథ్ , దర్శకుడు  సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ తదితరులు హాజరయ్యి చిత్ర యూనిట్ కు బ్లెస్సింగ్స్ ఇచ్చారు 
 
అనంతరం ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ.. దాసరి గారితో నేను ఎక్కువగా ట్రావెల్ చేయడం జరిగింది.. ఆలా నాకు రేలంగి గారు నాకు బాగా పరిచయం. తను చేసిన చాలా సినిమాలు  బిగ్ హిట్టయ్యాయి. అయన దర్శకత్వంలో  ప్రసన్న  చేస్తున్న ఈ సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ప్రస్తుతం క్రాఫ్ట్ తెలిసిన వారు చాలా తక్కువ మంది వున్నారు.అన్ని తెలిసిన దర్శకుడు నరసింహా రావు గారు లాంటి  దర్శకత్వంలో చాలా రోజుల తర్వాత మంచి టైటిల్  తో నిర్మిస్తున్న ప్రసన్న గారికి  ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
 
చిత్ర దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ... నిర్మాత ప్రసన్న గారు పిలిచి "ఊ అంటావా మావ ఊఊ  అంటావా మావ" సినిమా చేస్తారా అని అడిగారు. ఇప్పటి వరకు చేసిన కామెడీ సీనిమాలకు భిన్నంగా ఉండాలని కామెడీ డెవిల్స్. ఎన్నో హార్రర్ సినిమాలు వచ్చాయి. అయితే ఇది పూర్తి హార్రర్ సినిమా కాదు. ఇందులో కామెడీ తో కూడుకున్న హార్రర్ సినిమా. ప్రసన్న కుమార్ గారికి ఈ సినిమా చాలా ప్లస్ అవుతుంది. ఈ సినిమా అందరూ చాలా డెడికేటెడ్ గా చేశాము.  ఇందులో హీరోలుగా యస్వంత్ , జబర్దస్త్ రాకేష్ లను,నటి సత్య కృష్ణ కూతురు అనన్య అయితే బాగా ఉంటుందని సెలెక్ట్ చేయడం జరిగింది.ఈ సినిమాను రామోజీ ఫిల్మ్ సిటీ లో మంచి క్యాస్టింగ్ తో, మంచి టెక్నిషియన్స్  తో ఈ సినిమా చెయ్యడం జరిగింది.కొన్ని పాటలు, మినహా సినిమా పూర్తి అయ్యింది.  కాశ్మీర్ లో  జరిగే పాటల షూట్ తో సినిమా పూర్తి చేసుకొని జులై చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాము అని అన్నారు.
 
చిత్ర నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు వచ్చిన కామెడీ సినిమాలు ఎలా చరిత్ర సృష్టించాయో ఇప్పుడు వస్తున్న "ఊ అంటావా మావ ఊఊ  అంటావా మావ" కూడా చరిత్ర సృష్టిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సినిమా చేశాము. గతం లో 76 సినిమాలతో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు మా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. రేలంగి గారు ఇప్పటికీ ఎంతో డెడికేషన్ తో వర్క్ చేయడం చాలా గ్రేట్, డి .ఓ. పి శంకర్ గారు డబ్బు కోసం కాకుండా ఎమోషన్ కు పని చేస్తారు తన కెమెరా పని తనం ఎంతో అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా రేలంగి నరసింహారావు గారు గత సినిమాల రికార్థులను ఈ సినిమా అదిగమించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ...ఎన్నో హిట్ సినిమాలు తీసిన రేలంగి నరసింహారావు  గారి దర్శకత్వంలో  మిత్రుడు ప్రసన్న నిర్మాణ సారద్యం లో వస్తున్న ఈ చిత్రాన్ని రామోజీ ఫిల్మ్ సిటీ లో నిర్మించారు ఇందులో నాకు మంచి పాత్ర ఇచ్చారు.మంచి కామెడీ హార్రర్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
 
ఇంకా దర్శకులు అజయ్ కుమార్, రాజా వన్నెం రెడ్డి, నిర్మాత ఆచంట గోపినాథ్, బెక్కం వేణుగోపాల్,  నటి సత్య కృష్ణ, దర్శకుడు  సునీల్ కుమార్ రెడ్డి, చంద్ర మహేష్, నటుడు చిట్టి బాబు, హీరో యస్వంత్,  అనన్య, జబర్దస్త్ రాకింగ్ రాకేష్ మాట్లాడారు.