మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

ఆస్కార్ బరిలో మరో రెండు భారతీయ డాక్యుమెంటరీలు

oscar nomination1
చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల బరిలో రెండు భారతీయ డాక్యుమెంటరీ చిత్రాలకు నామినేషన్ దక్కింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో "ఆల్ దట్ బ్రీత్స్" నామినేషన్ దక్కించుకోగా, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో "ద ఎలిఫెంట్ విస్పరర్స్" నామినేషన్ పొందింది. "ఆల్ దట్ బ్రీత్స్" డాక్యుమెంటరీని షౌనక్ సేన్ రూపొందించగా, "ద ఎలిఫెంట్ విస్పరర్స్‌"ను కార్తీకి గొంజాల్వెజ్ డైరెక్ట్ చేశారు. 
 
ఢిల్లీలో.. గాయపడిన పక్షులను కాపాడే ఇద్దరు అన్నదమ్ములు మహ్మద్ సాద్, నదీమ్ షెహజాద్‌ల ఇతివృత్తంతో ఠఆల్ దట్ బ్రీత్స్ఠ డాక్యుమెంటరీని రూపొందించారు.
oscar nomination2
 
అలాగే, ఓ అనాథ ఏనుగు పిల్ల కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఓ దక్షిణ భారతదేశ జంట ఇతివృత్తంతో "ది ఎలిఫెంట్ విస్పరర్స్" షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారు. 
 
ఇదిలావుంటే, టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రంలోని 'నాటు నాటు' పాటకు కూడా ఆస్కార్ నామినేషన్ దక్కిన విషయం తెల్సిందే. మొత్తంగా ఈ యేడాది భారతీయ చిత్రపరిశ్రమ నుంచి మూడు ఆస్కార్ నామినేషన్లు దక్కాయి.