Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాంటి కట్స్ లేకుండా పద్మావతి రిలీజ్.. ఎక్కడ?

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం "పద్మావతి". దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన ఈ చిత్రం తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో రాణి 'పద్మావతి' ఢిల్లీ సుల్తాన్

Written By pnr
Updated: గురువారం, 23 నవంబరు 2017 (13:40 IST)
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం "పద్మావతి". దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన ఈ చిత్రం తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో రాణి 'పద్మావతి' ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీతో రాసలీలలు జరిపినట్టు చిత్రీకరించారు. వీటిని రాజ్‌పుత్‌ కర్ణిసేన వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అలాగే కొన్ని రాష్ట్రప్రభుత్వాలు కూడా ఈ చిత్రం విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు. 
 
ఈనేపథ్యంలో పద్మావతి సినిమాను యధావిధిగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. డిసెంబర్ ఒకటో తేదీన.. ఎలాంటి కట్స్ లేకుండా విడుదల చేస్తామని తెలిపింది. అయితే ఇది భారత్‌లో మాత్రం కాదు. లండన్‌లో. బ్రిటీష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్స్ సర్టిఫికేషన్ నుంచి అనుమతి వచ్చిందని.. మన దేశంలో కంటే ముందే అక్కడ విడుదల చేస్తున్నట్లు డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ వెల్లడించారు. పద్మావతి మూవీకి బ్రిటీష్ సెన్సార్ బోర్డ్ 12ఏ సర్టిఫికెట్ మంజూరు చేస్తూ తన వెబ్‌సైట్ స్పష్టం చేసింది. సినిమా నిడివి 163 నిమిషాల 42 సెకన్లు. అంటే 2 గంటల 43 నిమిషాలుగా ఉంది. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Woman: వంట విషయంలో ఏర్పడిన గొడవ.. నెట్టేసిన భర్త.. భార్య మృతి.. ఎక్కడ?

Madhya Pradesh: కృత్రిమ పనీర్ వల్ల ఆరోగ్య ప్రమాదాలు.. త్వరలోనే నిషేధం

ఏసీపీ కార్యాలయంలోని విశ్రాంతి గదిలో ఉరేసుకున్న కానిస్టేబుల్.. ఏమైంది?

మహిళా బిల్లుకు జై కొట్టిన విజయ్ ప్రభుత్వం... డీలిమిటేషన్‌కు నో

అప్పుల భారం తాళలేక దంపతుల ఆత్మహత్య.. అనాధలుగా నిలిచిన పిల్లలు

అన్నీ చూడండి

రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు

#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం

జ్ఞాపకశక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే...

ఎర్ర జామకాయలు తింటే...

ఫిక్కీ ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ- డిజిటల్ పరివర్తన సదస్సు

తర్వాతి కథనం
Show comments