ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:47 IST)

రామ్‌చరణ్‌ని వాడుకోను... పవన్ సంచలన వ్యాఖ్యలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' మూవీలో నటిస్తూ బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. తాజాగా ఆయన వర్క్అవుట్ చేస్తుండగా అతడి కాలికి గాయమైనట్లు, అందువలన పూణెలో షూటింగ్ చేస్తున్న షెడ్యూల్ రద్దు చేసి, మూడు వారాల పాటు రామ్ చరణ్ విశ్రాంతి తీసుకోనున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఇక షూటింగ్ రద్దు కావడంలో బాబాయి తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారని పుకార్లు వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని పవన్ తేల్చేశారు.
 
ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్ కళ్యాణ్‌ను, ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు, మీ కుటుంబానికి గొప్ప స్టేటస్ ఉంది. అలాంటిది మీ జనసేన పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొనడానికి ఎవరూ ఎందుకు రావడం లేదు? అని అడగ్గా ‘ఎందుకు రావడం లేదో నాకు తెలియదు, కానీ నేను యాక్టర్ల మీద ఆధారపడను, పొలిటికల్ ఐడియాలజీని నమ్ముకుంటాను' అని సమాధానం ఇచ్చారు. 
 
గతంలో బాబాయి అడిగితే తప్పకుండా వెళ్లి ప్రచారం చేస్తానని రామ్ చరణ్ చెప్పిన నేపథ్యంలో, మరి రామ్ చరణ్ ఇప్పుడు ప్రచారానికి వస్తారా? అనన్నదానికి ‘నేను నా స్టార్‌డమ్‌ స్టేటస్ వాడుకోను, ఎందుకంటే స్టార్‌డమ్ అనేది జనాలను ఆకర్షించడానికే తప్ప ప్రజలను చైతన్యపరచడానికి పని చేయదు. మరి అలాంటపుడు నేనెలా రామ్ చరణ్ స్టార్‌డమ్ వాడుకుంటానని అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక అన్నయ్య చిరింజీవి గారి విషయానికొస్తే 'ఆయన రాజకీయాల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రచారానికి రారు. రాజకీయాలపై మా ఇద్దరి దృక్పథం వేరు. ఆయన కళాకారుడు. నేను కళాకారుడిని కాదు. మా ఇద్దరి మధ్య అంతే తేడా...'' అని స్పష్టం చేశారు. 
 
చిరంజీవి ప్రస్తుతం తన దృష్టంతా ‘సైనా నరసింహా రెడ్డి' సినిమాపైనే పెట్టారు. తాజా షూటింగులో విరామం తీసుకుని కుటుంబంతో కలిసిన జపాన్ పర్యటనలో గడుపుతున్నారు.