సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (19:11 IST)

ఒకే స్కూటర్‌పై చరణ్, ఎన్టీఆర్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షెడ్యూల్ ప్రస్తుతం గుజరాత్‌లోని వడోదరలో జరుగుతోంది. నెలరోజుల పాటు అక్కడే షెడ్యూల్ చేయనున్నారు. 
 
సాధారణంగా హైదరాబాద్‌లో షూటింగ్ చేసే సమయంలోనే షూటింగ్‌కు సంబంధించిన విషయాలు బయటకు రావు. ఇలాంటిది బయట లొకేషన్స్‌లో షూటింగ్ చేస్తే కూడా.. ఆ విషయాలు అసలు ఎవరికీ తెలియవు.  
 
ఇలాంటి తరుణంలో షూటింగ్ స్పాట్‍‌కు సంబంధించిన ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు పోస్ట్ అయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఒకే స్కూటర్‌పై ప్రయాణిస్తూ కనిపించారు. 
 
చరణ్ స్కూటీ తీసుకొని క్యారీ వ్యాన్ దగ్గరి రాగానే, ఎన్టీఆర్ వ్యాన్‌లోనుంచి వచ్చి స్కూటీని నడుపుతాడు. చరణ్ వెనుక సీట్లో కూర్చుంటాడు. ఈ చిన్న వీడియోను ఫ్యాన్స్ ఎవరో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.