ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (13:00 IST)

అది ఉందని నమ్మి జగన్ వద్దకు వెళ్లాడు.. వైకాపాలో అలీ చేరికపై పవన్

తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న అత్యంత ఆప్తుల్లో ఒకరు పవన్ కళ్యాణ్. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో నిరూపించారు. పైగా, పవన్ కళ్యాణ్‌ తనకు అత్యంత ఆప్తుడని అలీ కూడా చెప్పుకొచ్చారు. అయితే, పవన్ సారథ్యంలోని జనసేనలో అలీ చేరకుండా జగన్ సారథ్యంలోని వైకాపాలో చేరారు. దీంతో పలు రకాలైన ఊహాగానాలు వచ్చాయి. 
 
వైకాపాలో అలీ చేరడంపై పవన్ స్పందించారు. ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను వెల్లడించారు. జగన్ మోహన్ రెడ్డికి బలం ఉందని నమ్మి అతని వద్దకు అలీ వెళ్లాడు. అదే చంద్రబాబు లేదని అక్కడకు వెళ్ళక పోవచ్చు. అది ఆయన ఛాయిస్.
 
పైగా, ఇక్కడ ఓ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాలి. యాక్టర్లు, పాపులారిటీ రెండూ వేర్వేరు. పాపులారిటీని చూపి ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతారు. వాటిని సీరియస్‌గా తీసుకోరాదు. అస్సలు నమ్మరాదు. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉంటా. ఇలాంటివాటిని నేను నమ్మను. కాగా, మార్చి 11వ తేదీన జగన్ సమక్షంలో అలీ వైకాపా కండువా కప్పుకున్నారు.