ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 నవంబరు 2017 (11:33 IST)

పవన్.. ఎవ్రీ డే హీరో ఎవరో తెలుసా?

'మై ఎవ్రీ డే హీరో' అతను అంటూ జనసేనాని, హీరో పవన్ కళ్యాణ్ చేసిన ఓ ట్వీట్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. సాధారణంగా కోట్లాది మంది అభిమానులకు పవన్ కళ్యాణ్ దైవం.

'మై ఎవ్రీ డే హీరో' అతను అంటూ జనసేనాని, హీరో పవన్ కళ్యాణ్ చేసిన ఓ ట్వీట్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. సాధారణంగా కోట్లాది మంది అభిమానులకు పవన్ కళ్యాణ్ దైవం. ఆయన మాటే వేదంగా కోట్లాది మంది అభిమానులు శిరసావహిస్తారు. అలాంటి పవన్‌కు ఓ వ్యక్తి హీరోగా ఉన్నారు. అందుకే అతన్ని ఉద్దేశించి మై ఎవ్రీ డే హీరో హకీం అంటూ ట్వీట్ చేశారు. 
 
ఇంతకీ ఈ హకీం ఎవరన్నదే కదా మీ సందేహం. హకీం ఓ బంగ్లాదేశీ. పవన్‌కు ఎన్నో విలువైన సూచనలు ఇచ్చిన వ్యక్తి. దీనిపై పవన్ స్పందిస్తూ, తానెప్పుడు లండన్ వెళ్లినా హకీం తనను కారులో లండన్ మొత్తం తిప్పి చూపిస్తాడని చెప్పుకొచ్చారు. బంగ్లాదేశీ అయిన హకీం లండన్‌లో ఎప్పుడో స్థిరపడ్డారని తెలిపారు. ఆయన తనతో ఎప్పుడూ ఏ విషయాలు మాట్లాడలేదని, కానీ తొలిసారి ఓ విషయం చెప్పాడని వెల్లడించాడు. 
 
తన రాజకీయ ప్రయాణం కోసం ఇచ్చిన విలువైన సలహా అది అని కొనియాడారు. మహిళల రక్షణ, గృహ హింస, సీనియర్ సిటిజన్ల కోసం జాగ్రత్తలు వంటి వాటిపై హకీం ఇచ్చిన సలహాలు చాలా విలువైనవని, వాటిని ఎప్పటికీ మర్చిపోలేనని, ఆ సలహాలను తాను పాటిస్తానని హకీంకు మాటిచ్చానని పవన్ తెలిపారు. 
 
గాంధీ గురించి హకీం చెప్పిన ఓ విషయం తనను కదిలించిందన్నారు. తాను ముస్లిం కావడంతో ఇటీవల ఆయన మక్కా మసీదును దర్శించినట్టు పవన్ తెలిపారు. ఏ మతమైనా హింసను ప్రోత్సహించదని ఆయన చెప్పారని పవన్ వివరించారు. నిజాలు చెప్పే వ్యక్తులు తనకు గురుతుల్యులతో సమానమని పవన్ వ్యాఖ్యానించారు.