పూజా హెగ్డే ఫోటోలు వైరల్.. లండన్ టూర్‌లో ఇలా..?
అగ్ర హీరోయిన్ పూజా హెగ్డే ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే లండన్ టూర్‌లో ఎంజాయ్ చేస్తోంది. షూటింగ్‌లో గ్యాప్ దొరికితే చాలు అమ్మడు టూర్‌కు వెళ్లిపోతుంది.
తాజాగా లండన్ టూర్‌లో భాగంగా ఆమె తీసుకున్న ఫోటోలను మంగళవారం రాత్రి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. రిటెయిల్ థెరపీ ఎంజాయ్ చేస్తున్నట్లుగా సదరు పోస్ట్‌లో ఆమె చెప్పుకొచ్చింది.
లండన్‌లోని ఓ ఫుట్‌వేర్ షాప్‌లో నింపాదిగా కూర్చున్న పూజ ఓ సెల్ఫీ తీసుకుంది. ఆ సెల్ఫీకి సంబంధించిన ఫొటోనే ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ ఫొటోను చూసిన నెటిజన్స్ పూజపై పలు రకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఫలితంగా సోషల్ మీడియాలో చేరిన నిమిషాల వ్యవధిలోనే ఈ పోస్ట్ వైరల్‌గా మారిపోయింది.