శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (16:25 IST)

దేవీశ్రీ ప్రసాద్‌ను రహస్యం పెళ్లి చేసుకున్న పూజిత పొన్నాడ?

poojitha ponnada
ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ను నటి పూజి పొన్నాడ రహస్యంగా పెళ్లి చేసుకుట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీటిపై ఈ వైజాగ్ బ్యూటీ స్పందించారు. తనకు ఎవరితోనూ పెళ్లికాలేదనీ, ఎవరితోనూ తాను రిలేషన్‌లో లేనని స్పష్టం చేశారు. 
 
ఇలాంటి కథనాలు ఎలా పుటిస్తారో అర్థం కావడం లేదని పూజిత పొన్నాడ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, దేవీ శ్రీ ప్రసాద్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపింది. తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దని ఆమె మీడియాకు హితవు పలికింది. 
 
కాగా, గతంలో రంగస్థలం, హ్యాపీ వెడ్డింగ్, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాల్లో నటించిన పూజిత ప్రస్తుతం "ఆకాశ వీధిలో.." అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, ఓ యూట్యూబ్ చానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. 
 
ఇందులో ఆమె మాట్లాడుతూ, ఇప్పటివరకు తాను ఒంటరినే అని, సోషల్ మీడియాలో నెగెటివ్ వ్యాఖ్యలు బాధ కలిగిస్తుందని చెప్పింది. ఈమె నాగార్జున - కార్తీ నటించిన "ఊపిరి" చిత్రంతో తెలుగు వెండితర ప్రవేశం చేసిన విషయం తెల్సిందే.