బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (19:00 IST)

పూనం కౌర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది

puunamkhaur
puunamkhaur
గత సంవత్సర కాలంగా జీరో జీఎస్టీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న పూనమ్ కౌర్ నవంబర్ 10వ తేదీన మాతో కలిసి సూరత్  గాంధీ పార్కులో చేనేతపై జీఎస్టి పన్ను ఎత్తివేయాలని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత తెలిజేస్తున్నారు.
 
పూనం కౌర్ 11వ తేదీన సబర్మతి ఆశ్రమంలో మౌన దీక్ష చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం 12వ తేదీ ఢిల్లీలో జరిగే బ్రహ్మకుమారి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్ళింది. అక్కడ ఆమెకు వెన్ను నొప్పి రావడంతో కేరళ వెళ్లడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆమెకు 18వ తేదీన ఫైబ్రో మయాల్జియా నిర్ధారణ అయ్యింది. కేరళలో ట్రీట్మెంట్ అనంతరం ఆమె ప్రస్తుతం మహారాష్ట్రలో విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమె పూర్తి ఆత్మిశ్వాసంతో వున్నారని యర్రమాద వెంకన్న నేత ప్రకటనలో పేర్కొన్నారు.