బుధవారం, 15 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (17:29 IST)

సమంత తరహాలో పూనమ్ కౌర్.. అరుదైన వ్యాధితో...

poonam kaur
హీరోయిన్లు వ్యాధుల బారిన పడటం ప్రస్తుతం చూస్తూ వున్నాం. ఇప్పటికిప్పుడు సమంత ఆరోగ్యంపై అభిమానులు ఆందోళనలో వున్నారు. తాజాగా మరో హీరోయిన్ కొత్త వ్యాధితో బాధపడుతోంది. నటి పూనమ్ కౌర్ రెండేళ్ల పాటు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఓ వార్త వెలుగులోకి వచ్చింది. 
 
ఫైబ్రోమయాల్జియా అనే అరుదైన సమస్యతో ఆమె బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా కండరాల నొప్పి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. 
 
కేరళ ఆయుర్వేద చికిత్స పూనమ్ తీసుకుంటుందట. అలసట, నిద్రలేమితో ఈ వ్యాధి వున్నవారు బాధపడతారని వైద్యులు చెప్తున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాయాజాలం సినిమాతో పూనమ్ టాలీవుడ్‌కు పరిచయం అయిన సంగతి తెలిసిందే.