శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (18:21 IST)

షూటింగ్‌కు సిద్ధమవుతున్న 'వకీల్ సాబ్'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం "పవర్ స్టార్" పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం పింక్‌కు రీమేక్. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సుధీర్ఘ విరామం తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ వర్గాలలోనూ కూడా క్రేజ్ కొనసాగుతుంది. 
 
వకీల్ సాబ్. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం పింక్‌కు రీమేక్. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సుధీర్ఘ విరామం తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ వర్గాలలోనూ కూడా క్రేజ్ కొనసాగుతుంది. 
 
అయితే, కరోనా లాక్డౌన్ కాణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం 40 శాతం షూటింగ్ పూర్తికాగా, మిగిలిన 60 శాతం షూటింగ్‌ను పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. నిజానికి లాక్డౌన్‌కు ముందే హీరోపై చిత్రీకరించాల్సిన చాలా భాగం పూర్తయింది. అయితే, అంతలోనే లాక్డౌన్ రావడంతో షూటింగుకి బ్రేక్ పడింది.
 
ఇపుడు కరోనా అన్‌లాక్‌తో షూటింగులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఒక్కొక్కరు షూటింగులు మొదలుపెడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, ప్రిన్స్ మహేష్ బాబులు షూటింగులు మొదలుపెట్టారు. అలాగే, ఇపుడు 'వకీల్ సాబ్' చిత్రం షూటింగుకి కూడా ప్లాన్ చేస్తున్నారు. 
 
ఈ నెల చివరి వారం నుంచి షూటింగ్ మొదలుపెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ముందుగా పవన్ లేని సన్నివేశాల చిత్రీకరణ కానిచ్చేస్తారట. పవన్ డిసెంబరులో ఈ షూటింగులో జాయిన్ అవుతారనీ, ఆ నెలాఖరుకి చిత్ర నిర్మాణాన్ని మొత్తం పూర్తిచేస్తారని సమాచారం.
 
ఇక 'వకీల్ సాబ్' పూర్తయ్యాక, పవన్ తాను చేయాల్సిన క్రిష్ దర్శకత్వంలోని సినిమా, హరీశ్ శంకర్ దర్శకత్వంలోని సినిమా షూటింగులను మొదలెడతారని అంటున్నారు. ఆయా సినిమాల ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. మొత్తంమీద పవన్ ఈ యేడాది మంచి దూకుడుమీద ఉన్నారు.