వరుణ్ తేజ్‌కి షాక్ ఇచ్చిన ప్రభాస్... కోలుకున్నాడా..? లేదా..?
కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపించిన కథానాయకుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ముకుంద, కంచె, అంతరిక్షం, ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్2 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడీ యువ కథానాయకుడు. అలాగే హీరో బాడీ లాంగ్వేజ్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ సినిమాను కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంలో దిట్ట డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్.
సూపర్ హిట్ చిత్రాలు `మిరపకాయ్`, `సుబ్రమణ్యం ఫర్ సేల్`, ఇండస్ట్రీ హిట్ `గబ్బర్ సింగ్`, సెన్సేషనల్ హిట్ `డీజే దువ్వాడ జగన్నాథమ్` వంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్సే హరీష్ మేకింగ్‌కు ఉదాహరణలు.
ఇలా వైవిధ్యమైన చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో వరుణ్ తేజ్, ఇండస్ట్రీ హిట్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం `వాల్మీకి`.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వరుణ్ తేజ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తుండగా.. తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్రలో నటిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాని సెప్టెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్టు గతంలో ప్రకటించారు.
అయితే... సాహో చిత్రాన్ని ప్రభాస్ ఆగష్టు 15 నుంచి 30కి వాయిదా వేయడంతో వరుణ్ తేజ్, హరీష్ శంకర్ షాక్ అయ్యారట. షాక్ నుంచి కోలుకుని ఆఖరికి ఈ సినిమాని సెప్టెంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఐనాంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.